జగిత్యాల, బతుకమ్మ :
అమెరికాలో జగిత్యాల జిల్లా వాసి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మల్యాల మండలం రామన్నపేటకు చెందిన రిషి రెడ్డి(22) అనే యువకుడు అమెరికాలోని ఓహోయోలో ఉంటూ ఇటీవలే బీటెక్ పూర్తి చేశారు. హాస్టల్లో అనుమానాస్పదంగా మరణించి ఉండడంతో తోటి స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రిషి రెడ్డి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.