Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2025, 10:44 pm Posted by : ramakrishna

విద్యుదాఘాతంతో యువకుడి మరణం

ఎల్లారెడ్డి, బతుకమ్మ: మండలంలోని సబ్దల్పూర్ గ్రామానికి చెందిన యువకుడు బయ్యని నవీన్ (28) విద్యుత్ ఘాతానికి గురై అకాల మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేక కుటుంబానికి భారం కాకూడదనే తలంపుతో  జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో మిషన్ భగీరథలో పనిచేస్తూ జీవన పోరాటం చేస్తున్నాడు. అయితే  ప్రతిరోజు లాగే పనిలో ఉన్న సమయంలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడనీ స్థానికులు తెలిపారు. ఈ విషాద వార్త విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామమంతా విషాదఛాయలతో నిండిపోయింది. యువకుడి అకాల మరణం గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. నవీన్ స్వభావం శాంతం, మితభాష, కుటుంబ బాధ్యతల పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిగా స్థానికులందరికీ సుపరిచితం, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, మృతుని కుటుంబానికి ప్రభుత్వం నుంచి న్యాయం, ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.