రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నిజామాబాద్, బతుకమ్మ : పట్టణంలోని బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్న సమయంలో పవర్ గార్డెన్ ఎదురుగా చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నవీన్ (25) అనే యువకుడు స్కూటీపై రిలయన్స్ బైపాస్ వైపు నుంచి అర్సపల్లి వైపు వెళ్తుండగా, అదే మార్గంలో అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్‌కు తలకు తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నిజామాబాద్ నగర...