Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 1:15 pm Posted by : ramakrishna

విశాఖ బీచ్ లో స్నానానికి వెళ్లి యువకుడి మృతి

 

. . . నిజామాబాద్ నగర వాసిగా గుర్తింపు

వెడ్ డెస్క్, బతుకమ్మ :

స్నేహితులతో కలిసి బీచ్ కు వెళ్లిన యువకుడు స్నానానికి దిగి నీటమునిగి  మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం విశాఖ బీచ్ లో జరిగింది. మృతుడిని నిజామాబాద్ నగరంలోని హమాల్ వాడికి చెందిన తమ్మిశెట్టి వికాస్ గా గుర్తించారు. హమాల్ వాడి కి చెందిన కొందరు యువకుడు విశాఖకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడ బీచ్ లో స్నానానికి దిగి గల్లంతు కాగా స్థానికులు కాపాడిన ప్రయోజనం లేకుండాపోయింది. వికాస్ మరణ వార్త తెలిసి హమాల్ వాడిలో విషాదచాయలు అలుముకున్నాయి.