ఇంజనీరింగ్ కళాశాల మంజూరుపై యూత్ కాంగ్రెస్ నాయకుల హర్షం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ మాట్లాడుతూ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల నాలుగు కోర్సులతో ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని, మహిళా విద్యార్థినిలకు...