Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 6:15 pm Posted by : ramakrishna

ఇంజనీరింగ్ కళాశాల మంజూరుపై యూత్ కాంగ్రెస్ నాయకుల హర్షం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ మాట్లాడుతూ  యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల నాలుగు కోర్సులతో ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని, మహిళా విద్యార్థినిలకు పూర్తి స్థాయిలో వసతులను సమకూర్చాలని అన్నారు.  రానున్న రోజుల్లో  సివిల్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని అన్నారు.  బీద బలహీన వర్గాల విద్యార్థులకు  చేయూత అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో గడుగు రోహిత్, పంచ రెడ్డి, చరణ్, ప్రమోద్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Youth Congress leaders rejoice over engineering college grant