Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 9:20 pm Posted by : ramakrishna

మహాధర్నా కి భారీ ఎత్తున కదిలిన యూత్ కాంగ్రెస్ నాయకులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్రం ప్రభుత్వం యూస్ ట్రేడ్ డీల్ వలన రైతులకు భారీ నష్టం వాటిల్లె ప్రమాదం ఉన్నందున తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కి జిల్లా నలుమూలల నుండి బస్సుల్లో భారీ ఎత్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. కార్యకర్తలు తరలి రావడానికి సహకరించిన నిజమాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ని, జాతీయ యూత్ అధ్యక్షులు ఉదయ్ భాను చీబ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అనుపల్ కిరణ్, ఆదిత్య పాటిల్, ఆకాష్ రెడ్డి, అబ్బోల్ల శ్రీకాంత్, అసెంబ్లీల అధ్యక్షులు కార్తిక్ యాదవ్, మహీందర్, ప్రశాంత్, చరణ్ గౌడ్, మొయిన్, జిల్లా, అసెంబ్లీ, మండలాల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.