Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 7:18 pm Posted by : ramakrishna

బీఆర్ఎస్ నాయకులపై యూత్ కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

 

భీమ్ గల్, బతుకమ్మ :

 

ఎల్‌బీ నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన యువ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిపై, కేంద్ర ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, అనుచిత వాఖ్యలు చేసిన వారిపై మండల యూత్ కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న అభ్యంతరకర,అసభ్యకర హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సందర్బంగా మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బద్ది అవినాష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలకు స్థానం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భీంగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమ్ గల్ మండల,పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు,గ్రామాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి సురేష్, గట్టు మురారి, సిద్ధపల్లి శ్రీను, నరేందర్ నేనావత్, రవి, రాకేష్, వినయ్, రాకేష్, హరీష్, దిలీప్ యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.