Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2025, 9:34 pm Posted by : ramakrishna

యువత ఆలోచనల అమలుకు యూత్ కాంగ్రెస్ వేదిక

 

. . . డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నాగేంద్ర బాబు

భీమ్ గల్, బతుకమ్మ :

 

దేశాభివృద్ధిలో కీలకమైన యువత తమ ఆలోచనలను, సమస్యలను వ్యక్తపర్చడానికి,సమాజంలో మార్పుకు యూత్ కాంగ్రెస్ ఒక వేదికని డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నాగేంద్ర బాబు అన్నారు.

భారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా భీంగల్ పట్టణ కేంద్రంలో శనివారంఆయన జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా  నాగేంద్ర బాబు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ యువతకు  వేడుక కాదని, వేదికని తద్వారా యువత శక్తిని, సమాజ సేవా నిబద్ధతను, దేశాభివృద్ధిలో యువత పాత్రను గుర్తు చేసే ఒక గొప్ప అవకాశమన్నారు.1960 చివరలో భారత ప్రధాని ఇందిరా గాంధీ  ఆలోచనతో మొదలై,  ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రపంచంలోనే అతిపెద్ద యువజన సంస్థగా దేశ వ్యాప్తంగా సేవలు అందిస్తోందన్నారు. యూత్ కాంగ్రెస్ యొక్క ప్రధాన లక్ష్యం యువతను శక్తివంతం చేయడం, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడమని, దేశ ప్రగతికి దోహదపడదమన్నారు. ఈ సంస్థ యువతకు నాయకత్వ శిక్షణ, రాజకీయ అవగాహన, సామాజిక సేవా అవకాశాలను అందిస్తుందన్నారు.చివరగా ప్రతి యువతీ, యువకుడు ఈ దేశం యొక్క భవిష్యత్తు ఆశాకిరనాలని,  మన అగ్రనాయకుడు రాహుల్ గాంధీని ప్రదాన మంత్రి ని చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ మనకు భారత్ జోడో యాత్ర లో బోధించిన సమానత్వం,  సామాజిక న్యాయం ని కాపాడుతు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ని బలపరుస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలను చైతన్యపరిచి రాష్ట్రంలో అదికారం చేపట్టడానికి కీలక పాత్ర పోషించిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ఆయన ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బద్ది అవినాష్ అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు సురేష్,పట్టణ యువజన నాయకులు సుంకరి సురేష్,ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు రెహమాన్, మండల సెక్రటరీ విజయ్,పట్టణ అధ్యక్షులు మహేష్,శ్రీను,అరుణ్,రాజు,విశాల్, చందు,రాకేష్,ప్రసాద్,గణేష్,ప్రణీత్,రాజేష్, సంకీర్త్, దిలీప్, రాజేందర్, గణేష్, అనిల్, దినేష్, మండల ,గ్రామల యువజన కాంగ్రెస్  కార్యకర్తలు పాల్గొన్నారు.