తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీని కలిసిన యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్
ఢిల్లీ, బతుకమ్మ : తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా మీనాక్షి నటరాజన్ యువజన కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరాల నీహార్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు తుంపల్లి మహీందర్, ఇతర జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఉన్నారు.