Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 5:06 pm Posted by : ramakrishna

రాచర్ల గొల్లపల్లిలో యువకుడి ఆత్మహత్య

 

. . . సూసైడ్ నోట్‌లో ప్రధాని పేరు

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మృతుడు పిట్ల వంశీ (25) గా గుర్తించారు. ఘటన స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్‌లో తన ఆత్మహత్యకు కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణమని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆ సూసైడ్ నోట్‌ను నిజంగా మృతుడు స్వయంగా రాశాడా లేదా మరెవరైనా రాశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్ ప్రామాణికతతో పాటు ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, పోలీసుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

Youth commits suicide in Racharla Gollapalli