Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2024, 7:51 pm Posted by : ramakrishna

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

బతుకమ్మ, భిక్కనూర్ :అప్పుల బాధతో భిక్కనూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి కి చెందిన సంతోష్ రెడ్డి (43) ఆత్మహత్య చేసుకున్నట్లు బిక్కనూర్ పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డి గత 20వ తారీఖున ఇంట్లో పొలానికి నీరు పారపెట్టి వస్తానని చెప్పి ఇంట్లో నుండి వెళ్లిన సంతోష్ రెడ్డి అక్కడ గుర్తుతెలియని క్రిమిసంహారక మందును తాగే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని కామారెడ్డికి చికిత్స నిమిత్తం తరలించగా అక్కడ పరీక్షించిన వైద్యులు ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్ రెడ్డి తెల్లవారుజామున మరణించినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.