Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 5:34 pm Posted by : ramakrishna

దుబాయ్ వేళ్లడం ఇష్టం లేక ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

 

…  గంటల్లో దుబాయ్ వేళ్లాల్సి ఉండగా

లింగంపేట ; బతుకమ్మ :

మోతె గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రంజిత్ రెడ్డి ( 23) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. లింగంపేట్ మండలం మోతే గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రంజిత్ రెడ్డి గతంలో రెండు పర్యాయాలు బతుకుతెరువు కోసం దుబాయ్ కి వెళ్లి వచ్చినట్లు తెలిపారు తిరిగి ఆదివారం మూడోసారి దుబాయ్ కి వెళ్లాల్సి ఉంది మూడోసారి దుబాయ్ కి వెళ్లడం రంజిత్ కు ఇష్టం లేకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లాలని సూచించారు ఒకసారి వెళ్లి వస్తే ఇల్లు కట్టుకుందాం అని కుటుంబ సభ్యులు దుబాయ్ వెళ్లడానికి ఒప్పించగా సంసిద్ధుడైనట్టు తెలిపారు దుబాయ్ వెళ్లడం ఇష్టం లేని కారణంగా శనివారం రాత్రి రంజిత్ రెడ్డి ఇంట్లోంచి వెళ్లి వ్యవసాయ పొలం వద్ద డ్రిప్పు పైపుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు నిద్రలేచిన సమయంలో రంజిత్ రెడ్డి కనిపించకపోవడంతో పరిసరాల్లో గాలించారు గ్రామానికి చెందిన ధ్యామని సాయిలు అనే వ్యక్తి రంజిత్ రెడ్డి చెట్టు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు దుబాయ్ వెళ్లడం ఇష్టం లేకపోవడంతోనే జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు మృతుని సోదరుడు రామ్మోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు ఎస్సై తెలిపారు.

Youth commits suicide by hanging himself, unwilling to go to Dubai