నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో ఒక యువకుడు తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి వెలుగు చూసింది. అటవీశాఖ అధికారి గా పని చేస్తున్న పద్మారావు తనయుడు సూరజ్ రావు (22) తన ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూరజ్ రావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని జిల్లా ఆస్పత్రికి తరలించారు.