Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 June 2025, 1:00 pm Posted by : ramakrishna

యువకుల రక్తదానం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ  :  నగరంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ చిరంజీవి జన్మదినం సందర్భంగా శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు.   సుమారు 20 మంది యువకులు రక్తదానం చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు.  ఈసందర్భంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ  మాట్లాడుతూ చిరంజీవి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం, అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. చిరంజీవి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఇల్లందుల మమత ప్రభాకర్ , మట్టం పవన్, శివన్ , హరి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Youth Blood Donation