. . . యువకుడికి శరీరంపై కత్తిపోట్లు
. . . మరో ఇద్దరు యువకులకు గాయాలు
. . . కేసు నమోదు చేసిన పోలీసులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నగరంలో కత్తిపోట్ల కలకలం రేపాయి. బుధవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీ లో యువకుడిపై పాత కక్షల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి చంపాలని ప్రయత్నించారు. ఈ సంఘటనలో జుబేర్ ఖాన్ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యారు. అతని కాపాడేందుకు ప్రయత్నించిన అతని స్నేహితులు పేరేజ్ ఖాన్ కు ఎడమ చేతి వేలిపై, అంజద్ ఖాన్ కు కుడి వేలి పై కత్తి తెగిన గాయాలు అయ్యాయి. బాధిత యువకుడు సోదరుడు అమేర్ ఖాన్ ఈ ఘటనలో తన ఇంటి ముందు నివసించే తండ్రి కొడుకులు నయీం, వసీం పై రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు పలు సెక్షన్ల కింద తండ్రి కొడుకుల కేసులు నమోదు చేశారు. గాయపడిన జుబేర్ ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.