Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2025, 5:15 pm Posted by : ramakrishna

గంజాయి విక్రయిస్తున్న యువకుని అరెస్ట్

  • తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎక్స్సైజ్ అధికారులు

 

భీమ్ గల్, బతుకమ్మ : మండలం కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో గంజాయి విక్రయిస్తున్న యువకున్ని బుధవారం భీమ్ గల్ ఎక్స్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక ఎక్స్సైజ్ సీ ఐ వేణు మాధవ రావు ఆధ్వర్యంలోని ఎక్స్సైజ్ పోలీసుల బృందం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వెలుపల తనిఖీలు నిర్వహించారు. ఆ తనీకిల్లో 128 గ్రాముల గంజాయి పొడి, మొబైల్ ఫోన్ తో పాటు నిందితుడు భూఖ్య రఘును అరెస్ట్ చేశారు. నిందితుడు మండలంలోని కారేపెల్లికి చెందిన వాడు కాగా వారి తల్లిదండ్రులకు అధికారులు ముందుగా కౌన్సిల్లింగ్ నిర్వహించారు.