యువతి ఆత్మహత్య
సదాశివనగర్, బతుకమ్మ : మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో యువతి పురుగలు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మమత, ప్రత్యూష అక్కాచెల్లెళ్లు. మమతకు వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. కొద్ది రోజులకు మమత అత్తగారింట్లో సమస్యలతో పాటు భర్తతో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. జీవితం మీద విరక్తి చెంది ఈనెల 7న పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు మమతను వెంటనే ఆసుపత్రికి తరలించారు....