Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 October 2024, 4:31 pm Posted by : ramakrishna

యువతి ఆత్మహత్య

సదాశివనగర్, బతుకమ్మ : మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో యువతి పురుగలు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మమత, ప్రత్యూష అక్కాచెల్లెళ్లు. మమతకు వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. కొద్ది రోజులకు మమత అత్తగారింట్లో సమస్యలతో పాటు భర్తతో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. జీవితం మీద విరక్తి చెంది ఈనెల 7న పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు మమతను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పింది. తన అక్క జీవితం  గురించి ఆలోచిస్తూ ప్రత్యూష మనోవేధనకు గురైంది. ప్రత్యూష కూడా పురుగుల మందుతాగి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రత్యూష గురువారం మరణించింది.