Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 November 2025, 4:29 pm Posted by : ramakrishna

ఉరేసుకొని యువతి ఆత్మహత్య

మెండోరా, బతుకమ్మ: ఉరివేసుకొని యువతి ఆత్మహత్య చేసుకుందని మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మెండోరా మండలం వెల్గటూర్ గ్రామంకి చెందిన రెడ్డి అనూష (25) అనే యువతి మానసిక సమస్య,తీవ్రమైన తలనొప్పితో, చర్మ వ్యాధితో బాధపడుతూ జీవితంపై విరక్తి తో బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్న దూలానికి ఉరి వేసుకొని ఆత్మా హత్య చేసుకుందని, మృతురాలు అన్న అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.