ఇంటర్నేషనల్ హాకీకి ఎంపికైన గర్గుల్ గ్రామ యువ క్రీడాకారిణి

  . . . కాలిగోట వీణకు ఘన సత్కారం, ఆర్థిక సహాయం అందజేత   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన ప్రతిభావంతురాలైన యువ క్రీడాకారిణి కాలిగోట వీణ ఇంటర్నేషనల్ స్థాయిలో హాకీ ఆడేందుకు ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. చిన్న గ్రామం నుండి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకునే అవకాశాన్ని సాధించడం ఆమె కృషి, పట్టుదల, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా వీణకు అవసరమైన ప్రయాణ, కిట్, ఇతర ఖర్చుల నిమిత్తం...