. . . సాక్ష్యాల తారుమారు నేరంలో మరో ఎడేళ్ల కఠిన కారాగార శిక్ష
. . . బాధిత బాలుని కుటుంబానికి 5 లక్షల పరిహారాని కి సిపార్సు
. . . నిజామాబాద్ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
పన్నెండు సంవత్సరాల బాలుడిని హత్య చేసిన కేసులో ముద్దాయి బండి నరేందర్ కు జీవిత కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ మంగళవారం తీర్పు చెప్పారు.సాక్ష్యాలు తారుమారు చేసిన నేరంలో మరో ఏడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు. రెండు నేరాలలో పదివేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల చొప్పున సాధారణ జైలు శిక్ష అనుభవించాలని జడ్జి తమ తీర్పులో పేర్కొన్నారు. స్పెషల్ జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పులోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని పోచమ్మ గల్లి కి చెందిన బండి నరేందర్ బతుకుతెరువు కోసం దుబాయి దేశం వెళ్ళాడు అక్కడ అతనికి సూడాన్, నేపాల్ దేశానికి చెందినవారితో వ్యక్తిగత సంబంధాలు ఏర్పడినవి.అతనికి అక్కడ హోమో సెక్సువల్ అలవాటు అయింది.తిరిగి బాల్కొండ వచ్చిన అతను నాగపూర్ గ్రామానికి నివాసులైన దశరథ్ మేకలు మేపే వాడు అందులో కొన్ని మేకలు అమ్మగా 23వేల 800వందలు రూపాయలు రాగా అవి నరేందర్ దగ్గర ఉండటంతో ఆ డబ్బులను అదే మండలంలోని గ్రామంలో తన అక్కకు ఇచ్చి రావలసిందిగా దశరథ్ కోరాడు.2024 సెప్టెంబర్ 11 న బైక్ పై వెళ్లిన నరేందర్ గ్రామానికి వెల్లి దశరథ్ అక్క ను కలిసి మేకలు కొన్నవాళ్లు ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఇవ్వగానే తీసుకుని వచ్చి ఇచ్చేస్తానని తెలిపి ఆమె పన్నెండు సంవత్సరాల చిన్న కుమారుడిని గణపతులు చూపించుకుని వస్తానని తెలిపి ఆ పన్నెండేళ్ల బాలున్ని కొంత సమయం కురుమ సంఘం గణపతుల మండపం దగ్గర ఉంచి అక్కడి నుండి బాలున్ని తీసుకుని బాల్కొండ మండలం శివారులోని ఖిల్లా గుట్ట కమాన్ దగ్గర బలవంతంగా బాలుని బట్టలు విప్పి లైంగిక దాడి చేశారు. అతను ప్రతిఘటించడంతో బండరాయి తీసుకుని బాలుని తలపై కొట్టి హత్య చేశాడనే నేర అభియోగం కోర్టు నేర న్యాయ విచారణ లో రుజువు అయినట్లు జడ్జి దుర్గా ప్రసాద్ తమ తీర్పులో పేర్కొంటూ హత్య నేరంగానే జీవిత కారాగార శిక్ష, సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నాలు చేసినందున మరో ఏడు సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించారు. రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో ఆయన తెలిపారు. బాల్కొండ పోలీస్ సర్కిల్ పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ రెడ్డి ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
. . . బాలుని బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారానికి సిపార్సు
పన్నెండు సంవత్సరాల బాలుడు హత్యకు గురై నందున సదరు కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల పరిహారం అందజేసే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జడ్జి దుర్గాప్రసాద్ నిజామాబాద్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కు సిఫార్సు చేశారు.