రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
బతుకమ్మ, హైదరాబాద్ హైదరాబాద్‌లోని సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. షాపూర్ నగర్ నుండి సూరారం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఇసుక లోడుతో వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.