బాన్సువాడ, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో విద్యాదాఘాతంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన బీర్కూర్ మండలంలో గురువారం చోటు చేసుకుంది. బీర్కూరు మండలం కిష్టాపూర్..గ్రామానికి చెందిన యువకుడు మహేష్(26) అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇంట్లో విద్యుత్ సంబంధిత సమస్య ఉండడంతో దానిని స్వయంగా సరిచేయడానికి ప్రయత్నించగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే మహేష్‌ను బాన్సువాడ ఏరియా ఆసుపత్రి కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.