మెడికల్ డ్రగ్స్ తీసుకొని యువకుడి మృతి

హైదరాబాద్ లోని  బాలాపూర్‌లో ఘటన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్,  బతుకమ్మ  : హైదరాబాద్ లోని  బాలాపూర్‌లో మత్తుకోసం మెడికల్ డ్రగ్స్ తీసుకొని యువకుడి మృతి.. మృతుడిని ఇంటర్ చదువుతున్న అబ్దుల్ నసర్ గా గుర్తించారు. ముగ్గురు విద్యార్థులకు సాహిల్ అనే వ్యక్తి మెడికల్ డ్రగ్స్ విక్రయించారు. ఇంజక్షన్‌తో పాటు టాబ్లెట్లను ముగ్గురు విద్యార్థులు ఒకేసారి తీసుకున్నారు. ఈక్రమంలో అబ్దుల్ నసర్ అక్కడికక్కడే  మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.