Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 12:05 pm Posted by : ramakrishna

ప్రమాదవశాత్తు రైలు కింద పడి యువకుడి వ్యక్తి మృతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ  :

 

ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి రైలు, ప్లాట్ ఫారం మధ్య పడిపోగా రైలు కదలడంతో మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ కిరణ్ కుమార్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఓ గుర్తు తెలియని అందాజ 40-45 సంవత్సరాల వయసు గల పురుషుడు రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ ఫ్లాట్ ఫారం మధ్యలో నలిగిపోయి తీవ్ర గాయలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని గుర్తించుటకు ఎటువంటి ఆధారాలు లబించలేదని, మృతుని కుడి చేయికి మద్య వేలు తెగి ఉందన్నారు. బ్లాక్ కలర్ ట్రాక్ ఫ్యాంట్, అప్పర్ దరించి యున్నాడని, మృతుని గురించి వివరాలు తెలిసినచో రైల్వే హెడ్ కానిస్టేబుల్ హన్మండ్లు సెల్ నంబర్ 8712568440కి సమాచారం ఇవ్వాలని కోరారు.

Young man dies after accidentally falling under train