ఆస్తిని పంచివ్వడం లేదని యువకుడు ఆత్మహత్య
నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్సపల్లిలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకుపాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. అర్సపల్లి చెందిన సాయిలు(40) తనకు వారసత్వంగా వస్తున్న ఖానాపూర్ అర్సపల్లి శివారులోని వ్యవసాయ భూమిని పంచి ఇవ్వడం లేదని తన ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకుపాల్పడ్డాడు. సాయిలు తనకు వారసత్వంగా వస్తున్న భూమిని పంచి ఇవ్వాలని గతంలో కులం పంచాయతీ పెట్టాడు. సామరస్యంగా పంచుకోవాలని కుల పెద్దలు సూచించిన తల్లి, సోదరి, అల్లుడు వినకపోవడంతో మనస్థాపం...