నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్సపల్లిలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకుపాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. అర్సపల్లి చెందిన సాయిలు(40) తనకు వారసత్వంగా వస్తున్న ఖానాపూర్ అర్సపల్లి శివారులోని వ్యవసాయ భూమిని పంచి ఇవ్వడం లేదని తన ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకుపాల్పడ్డాడు. సాయిలు తనకు వారసత్వంగా వస్తున్న భూమిని పంచి ఇవ్వాలని గతంలో కులం పంచాయతీ పెట్టాడు. సామరస్యంగా పంచుకోవాలని కుల పెద్దలు సూచించిన తల్లి, సోదరి, అల్లుడు వినకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని సాయిలు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి సాయిలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడు సాయిలుకు భార్య, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నట్టు తెలిసింది.