బతుకమ్మ, భిక్కనూరు: మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు ఈ సందర్భంగా మాట్లాడుతూ జంగంపల్లి గ్రామానికి చెందిన సైదు గారి శ్రవణ్ (36) గత కొంతకాలంగా మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది తెల్లవారుజామున 4 గంటలకు ఇంట్లో నుండి పని కోసం వెళుతున్నాను అని చెప్పి గ్రామ శివారులోని పెద్ద చెరువు సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య ప్రత్యూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎస్సై తెలిపారు.