నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
బిటేక్ పాస్ అయ్యానని తల్లిధండ్రులు, బందువులకు చెప్పుకున్నాడు యువకుడు. కానీ బిటేక్ ఫేయిల్ అయిన విషయం తెలిసిన తల్లీ ప్రశ్నించడంతో అవమానంగా బావించిన యువకుడు రైలుకిందపడి అత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన అదివారం వెలుగు చూసింది. నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని సాయి క్రిపనగర్ కు చెందిన రాజరపు శ్రీనివాస్ (25) బిటేక్ చదివారు. అయితే అందులో ఫేయిల్ అయ్యారు. కాని ఆ విషయం దాచి తల్లిధండ్రులు, బందువులకు తాను పాస్ అయ్యానని చెప్పుకున్నాడు. ఇటివల ఈ విషయం తెలిసిన తల్లి తన కోడుకును ప్రశ్నించడంతో శ్రీనివాస్ ఈ నెల 21న నిజామాబాద్ – డిచ్ పల్లి రైల్వే స్టేషన్ మద్య గుర్తు తెలియని రైలు కింద పడి అత్మహత్యకు పాల్పడ్డారు. మృతుని తండ్రి పిర్యాది మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.