నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ బస్ స్టాండ్ ప్రాంతంలో జ్యూస్ సెంటర్ లో పనిచేస్తున్న యువకుడిపై కొందరు పంచ్ లతో దాడి చేశారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికంగా జ్యూస్ సెంటర్ లో పనిచేసే సయ్యద్ అజీమ్ పై పొరుగునే ఉన్న మరో జ్యూస్ సెంటర్ నిర్వహకుడు ఇర్ఫాన్, సైప్ అనే యువకులు తమ వద్ద పని చేయకుండా ఇతరుల వద్ద ఎలా పనిచేస్తావని వాగ్వివాదానికి దిగారు. ఈ తరుణంలో మాటా మాటా పెరిగి అజీం పై ఇర్పాన్ తన వద్ద ఉండే పంచ్ తో ముఖం పై దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అజీం పై దాడి చేసిన ఇర్ఫాన్ ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో ఇదివరకు జైలు జీవితం గడిపారు. ఇటీవల కాలంలో జరిగిన మ్యాచ్ ల సందర్భంగా మళ్లీ క్రికెట్ బెట్టింగ్ కోసం ఐడిలు ఇచ్చినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు.
