Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 9:39 am Posted by : ramakrishna

బిజెపిలో చేరిన యువ నాయకుడు రాజ్ గణేష్

 

. . . కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ అరవింద్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్త, అనేక సంవత్సరాలు హిందుత్వ భావజాలంతో పనిచేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని ఆశయంతో ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో రాజ్ గణేష్ భారతీయ జనతా పార్టీలో చేరారు. గురువారం 300 మంది యువకులతో కలిసి బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ ఆధ్వర్యంలో చేరగ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీ విస్తరణ, సైదాంతిక భావజాలాన్ని, కింది స్థాయిలోకి తీసుకెళ్లడం కోసం రాజ్ గణేష్ గతంలో పని చేశారని,భవిష్యత్తులో అదే రకంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ,జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె. గంగారెడ్డి,ఎన్నికల ఇన్చార్జ్ ప్రభాకర్,జిల్లా కార్యదర్శి ఐటి పిల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Young leader Raj Ganesh joins BJP