Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 December 2024, 6:47 pm Posted by : ramakrishna

అనారోగ్యంతో యువ రైతు ఆత్మహత్య

కామారెడ్డి,బతుకమ్మ:

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రైతు ఆత్మ హత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కన్నా పూర్ గ్రామానికి చెందిన ఉరిమి శెట్టి స్వామి (38) గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బిపి  పెరగడంతో , మనస్థాపం చెంది స్వంత పొలంలో మామిడి చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు .ఆత్మహత్య సమయం లో చెట్టుకొమ్మ విరిగి చెంపపై గాయమైందని  భార్య ఉరిమిశెట్టి వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్  వివరించారు.