జూబ్లీహిల్స్ రూట్స్ కాలేజీలో యువ రైతు పురస్కారాలు
నిజామాబాద్, బతుకమ్మ: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువ దినోత్సవం సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో ఆదివానం జూబ్లీహిల్స్ రూట్స్ కాలేజీలో ఘనంగా యువ రైతు పురస్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రూట్స్ కాలేజీ అధినేత భిక్షపతి పడాల హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువ రైతులకు పురస్కారాలు అందజేశారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ యువ రైతులు సంఘటితం అయి కొత్త రకపు వ్యవసాయాన్ని చేయాలని సూచించారు....