Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2024, 6:21 pm Posted by : ramakrishna

దీన్ దయాల్ జయంతి సందర్భంగా మొక్కలు నాటిన బిజెపి యువ నాయకులు

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : బీజేపీ యువ నాయకులు దండు శ్రీకాంత్ ఆధ్వర్యంలో 5 వ డివిజన్ బోర్గమ్ (పి) పరిధిలోని కళాభారతి ఆవరణలో దేశసేవనే పరమావధిగా ,ఏకాత్మత మానవతా వాదాన్ని ప్రతిపాదించి కార్యకర్తల మనోహృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మామిడి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి జె వై ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్ హాజరయ్యారు. దండు శ్రీకాంత్ మాట్లాడుతూ దేశం కోసం నిస్వార్థంగా పనిచేసిన దీన్ దయాళ్ నడిచిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాభారతి సభ్యులు చిలుక సాయిలు,మాస్టర్ జలంధర్,అంబాలాల్,శివయ్య,దర్సింగ్,తలారి నారాయణ తదితరులు పాల్గొన్నారు.