Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2025, 6:15 pm Posted by : ramakrishna

నీ భవిష్యత్తును నీవే నిర్మించుకోవాలి

మోర్తాడ్, బతుకమ్మ: నీకు నీవే నిర్మాత వై నీ భవిష్యత్తును ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా నీవే నిర్మించుకోవాలని  మోటివేషనల్ స్పీకర్ మహేష్ కుమార్ అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం అహర్నిశలు శ్రమిస్తూ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కాలని వచ్చే అడ్డంకులను అవరోధాలను ఎదుర్కొని నిలబడితే విజయం తధ్యమని విద్యార్థులకుఆ అవగాహన కల్పించారు.  మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోటివేషనల్ సెమినార్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చరవాణి, టీవీలకు, సినిమాలకు, సిరియళ్ళకు  ఎంత దూరం ఉంటే అంత మంచిదని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. కార్యక్రమం ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You have to build your own future