Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 3:12 pm Posted by : ramakrishna

ఉద్యమ నాటి గుర్తులను మళ్లీ గుర్తు చేశావు తమ్ముడు

 

. . . వినయ్ భాస్కర్ ను ఫోన్ లో పరామర్శించిన కేసీఆర్ 

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన నేపథ్యంలో, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి ఫోన్లో దాస్యం వినయ్ భాస్కర్ తో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగించాలని, ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి “తమ్ముడు వినయ్.. ఉద్యమ నాటి గుర్తులను మళ్లీ గుర్తు చేశావు” అని కేసీఆర్ అన్నారు. కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సైతం వినయ్ భాస్కర్ ని ఫోన్లో పరామర్శించారు.