Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 6:51 pm Posted by : ramakrishna

చేతికి వచ్చిన పంటను కోయనిస్తలేరు

  • పోలీసులను ఆశ్రయించిన బాధితులు

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని మెగ్య నాయక్ తండాకు చెందిన దేగవత్ రాజు నాయక్ అనే రైతు చేతికి వచ్చిన పంటను వరి కోత యంత్రాలతో కోయనీయడం లేదని ఆరోపిస్తూ శుక్రవారం ఇందల్వాయి ఎస్సై సందీప్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. గన్నారం రెవిన్యూ పరిధిలోని మేఘ్య నాయక్ తండాకు చెందిన సర్వేనెంబర్ 585లో గతంలో ఇచ్చిన పోడు భూములలో భాగంగా తమ కుటుంబానికి వచ్చిన 18 విశాల భూమిలో వరి తో పాటు ఆరుతడి పంటలు వేయడం జరిగింది అని అన్నారు. అట్టి భూమిని కొందరు అటవీశాఖ అధికారులతో కుమ్మక్కై తమ భూమికి వెళ్లకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. పూర్య నాయక్ తో పాటు 35 మంది కక్షగట్టి తమ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమకు కుల బహిష్కరణ విధించడం జరిగిందని తెలిపారు. వరి కోత యంత్రాల యజమానులతో తమ వరి ధాన్యాన్ని కోసేందుకు రావాలని వేడుకోగా సదరు యజమానులు కుల బహిష్కరణ ఉండటం వల్ల తాము రాజు నాయక్ కు చెందిన పంట పొలాన్ని కోయలేమని తెలిపారని బాధితులు రోదిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద తెలిపారు. ఆయన వెంట ఇద్దరు కుమారులు, భార్య, కోడలు తదితరులు ఉన్నారు.