Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 January 2026, 5:04 pm Posted by : ramakrishna

చదువుతో ఏదైనా సాధించవచ్చు

– జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి..

 

రుద్రూర్, బతుకమ్మ :

 

చదువుతోనే ఏదైనా సాధించవచ్చని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయంలో రీడింగ్ హాల్ ను జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవితంలో ఏదైనా సాధించాలంటే చదువు తప్పనిసరి అని అన్నారు. నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఈ రీడింగ్ హాల్ ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు అవసరం అయిన బుక్స్ ను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, గ్రామ పెద్దలు బచ్చు రామ్ సెట్, రైడ్స్ అధ్యక్షులు కృష్ణ, రైడ్స్ సభ్యులు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

You can achieve anything with education.