యోగా టీం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
భీమ్ గల్, బతుకమ్మ : మకర సంక్రాతిని పురస్కరించుకొని యోగా టీం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందని యోగా గురూజీ పర్స అనంత రావు అన్నారు. గురువారం పట్టణం లోని శ్రీసరస్వతి శిశు మందిర్ లో యోగా టీం నిర్వహించిన రంగవల్లి ముగ్గుల పోటిల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ఆయన అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో మైనారిటీ యువతులు పాల్గొనడం ఆనందం ఇచ్చిందన్నారు. ముగ్గుల పోటీల్లో కుల మతాలకు అతీతంగా యువతులు ఉత్సహంగా పాల్గొనడం అభినందనీయం అన్నారు. యోగా టీం...