భీమ్ గల్, బతుకమ్మ : మకర సంక్రాతిని పురస్కరించుకొని యోగా టీం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందని యోగా గురూజీ పర్స అనంత రావు అన్నారు. గురువారం పట్టణం లోని శ్రీసరస్వతి శిశు మందిర్ లో యోగా టీం నిర్వహించిన రంగవల్లి ముగ్గుల పోటిల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ఆయన అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో మైనారిటీ యువతులు పాల్గొనడం ఆనందం ఇచ్చిందన్నారు. ముగ్గుల పోటీల్లో కుల మతాలకు అతీతంగా యువతులు ఉత్సహంగా పాల్గొనడం అభినందనీయం అన్నారు. యోగా టీం ఆధ్వర్యంలో భవిష్యత్తు లో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. నేటి యువత కు సంస్కృతి, సంప్రదాయాలు తెలియ చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు యోగ టీం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా విజేతలుగా నిలిచిన లాస్య, తోపారం సంతోషిని, పిల్లోళ్ల రవళి, చిన్న పిల్లల్లో నుండి మంచిర్యాల వసంత, మంతెన హర్షిని, రింశా ( మైనారిటీ ) లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమం లో బద్రి జలజ, నర్సయ్య, జావ్వాజీ భూమయ్య, శివ కుమార్, జేజే నర్సయ్య, రమేష్, శ్రీధర్, గణేష్, పురస్తు లింబాద్రి, ఎస్పీ ప్రవీణ్, బాపూరావు, నవీన్, సురేందర్, చారి, శ్రీనివాస్, భూపాల్, గోవర్ధన్, శ్యామ్, సర్వ సమాజ్ అధ్యక్షులు శెవ్వ అశోక్ తదితరులు పాల్గొన్నారు.