Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 June 2025, 4:14 pm Posted by : ramakrishna

జీవితంలో యోగా ఒక భాగమవ్వాలి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల శ్రీరామ గార్డెన్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వారి ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్ పి.సాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ మన జీవితంలో ఒక భాగంగా యోగా ఉండాలని ఆయన సూచించారు శారీరక మానసిక ఆధ్యాత్మిక సమతుల్యతకు దోహదపడుతూ ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది అన్నారు. యోగా అనేది శరీర దృఢత్వానికి మనసు ప్రశాంతతకు చాలా ఉపయోగకరమైన దాని సూచించారు. యూవత డ్రగ్స్ వాడకం తగ్గించాలని తెలియజేశారు. జూన్ 26వ తారీఖున “” ఆంటీ డ్రగ్స్ డే ” రావడం అదే నెలలో 21 వ తారీఖున యోగా రావడం మంచిదని అన్నారు. అనంతరం వివిధ రకాల యోగ ఆసనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాదు అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి ,  అదనపు పోలీస్ కమీషనర్ (ఎ.ఆర్) రాంచంధర్ రావ్, నిజామాబాదు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా వ్యాప్తంగా గల యువజన సంఘాలు వారు,  విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, క్రీడాకారులు, యోగా గురువులు, సంగీత, డాక్టర్ తిరుపతిరావు, గంగాధర్, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.