Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 6:48 pm Posted by : ramakrishna

  యోగా ఆరోగ్య ప్రధాయని

 

.. జిల్లా జడ్జి భారత లక్ష్మీ

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ

మానవ ఆరోగ్య స్థితిగతులను మార్చే శక్తి యోగాకు ఉన్నదని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భారత లక్ష్మీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో ఆమె అదనపు జిల్లా జడ్జి సుగాలి నారాయణ, బార్ అధ్యక్షుడు నీలకంఠ రావు, జూనియర్ సివిల్ జడ్జి పాముజుల శ్రీనివాస్ రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, జిల్లా కోర్టు ముఖ్య పరిపాలన అధికారి గోవింద్ రావు, కోర్టు సిబ్బంది, విద్యార్థులతో కలిసి యోగా చేసిన అనంతరం మాట్లాడుతూ.మానవ శరీరానికి అనారోగ్య సమస్యలు రానీయకుండా యోగా కాపాడగలదని తెలిపారు. నిత్యజీవితంలో యోగా చేయడానికి సమయం కేటాయించుకోవాలని ఆమె కోరారు.పని ఒత్తిడి నుండి స్వాంతన చేకూర్చుకోవడానికి యోగాను మించిన ఔషధం లేదని పేర్కొన్నారు.

Yoga promotes health

-చిన్ననాటి నుండే యోగాను జీవితంలో భాగం చేసుకోండి

-అదనపు జిల్లా జడ్జి సుగాలి నారాయణ

మానసిక ప్రశాంతతకు యోగా ముఖ్యమైన ఆరోగ్య సాధనమని నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జి సుగాలి నారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని నాగారంలో గల ప్రభుత్వ బాలుర పరిశీలక గృహంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన బాలురచే యోగా చేయించి యోగా వలన లభించే ప్రయోజనాలు వివరించారు.చిన్ననాటి నుండి యోగాను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు.యోగాతో శరీరాన్ని మరల్చడం మూలంగా జీవ నాడులలో కదలికలు ఏర్పడి ఆరోగ్యవంతంగా ఉంచుతాయని ఆయన తెలిపారు.నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నీలకంఠ రావు యోగా వలన సమకూరే ప్రయోజనాలు తెలిపారు. కార్యక్రమంలో పరిశీలన గృహం పిటి నాగరాజు, ప్రొబేషన్ అధికారి యాసీన్ అహ్మద్, ప్రభాకర్, శ్రావణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Yoga promotes health