విద్యా వికాస్ కళాశాలలో ఘనంగా యోగా దినోత్సవం
బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో, 12వ బెటాలియన్ సౌజన్యంతో జూన్ 21 వ తేదీ శనివారం రోజున ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన 12వ బెటాలియన్ సర్దార్ అనూజ్ రానా మాట్లాడుతూ, యోగా అనేది భారత ప్రాచీన సంపదగా పేర్కొన్నారు. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా, మనసును ప్రశాంతంగా ఉంచేందుకు యోగా ముఖ్య భూమిక వహిస్తుందన్నారు....