సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ వీసీ వైఎల్ శ్రీనివాస్ కు సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన వర్సిటీ తొలి వీసీ  ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ ను ఆదివారం ఇందూర్ స్కూల్ కరస్పాండెంట్ కొడాలి కిశోర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శ్రీనివాస్ తన గ్రాడ్యూయేట్  వరకు బోధన్ లో చదువుకున్నారని. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ(ఇంగ్లీష్), ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారని తెలిపారు. ఇంగ్లీష్ లో భారతీయ రచనలు, ఫిల్మ్ అండ్ మీడియా స్టడీస్, ఇంగ్లీష్ భాష బోధన తదితర అంశాలపై పరిశోధనలు చేశారన్నారు. అంతర్జాతీయ జర్నల్స్ లో...