పసుపు బోర్డు రైతులకు ఒక విప్లవం

అర్వింద్ కు పాదాభివందనం ప్రకృతి రైతు కర్నే లక్ష్మినర్సయ్య మోర్తాడ్, బతుకమ్మ: పసుపు బోర్డు జిల్లాకు రావడం వల్ల రైతులు దీనినొక విప్లవంగా భావించవచ్చని ప్రకృతి వ్యవసాయదారుడు, మోర్తాడ్ బిజెపి సీనియర్ నాయకుడు కర్నే లక్ష్మినర్సయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇందూర్ లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి, ఆటుపోట్లను, దాడులను సైతం తట్టుకొని బోర్డును తీసుకొచ్చిన ఎంపీ అర్వింద్ కు పాదాభివందనాలు చేస్తున్నానని చెప్పారు. రైతులకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడి...