Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 January 2025, 4:10 pm Posted by : ramakrishna

పసుపు బోర్డు రైతులకు ఒక విప్లవం

  • అర్వింద్ కు పాదాభివందనం
  • ప్రకృతి రైతు కర్నే లక్ష్మినర్సయ్య

మోర్తాడ్, బతుకమ్మ: పసుపు బోర్డు జిల్లాకు రావడం వల్ల రైతులు దీనినొక విప్లవంగా భావించవచ్చని ప్రకృతి వ్యవసాయదారుడు, మోర్తాడ్ బిజెపి సీనియర్ నాయకుడు కర్నే లక్ష్మినర్సయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇందూర్ లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి, ఆటుపోట్లను, దాడులను సైతం తట్టుకొని బోర్డును తీసుకొచ్చిన ఎంపీ అర్వింద్ కు పాదాభివందనాలు చేస్తున్నానని చెప్పారు. రైతులకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడి దశాబ్దాల రైతుల కలను సాకారం చేసిన రైతు బాంధవుడు అరవింద్ ధర్మపురికి, అలుపెరగని పోరాటం చేసిన రైతులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పసుపు బోర్డు ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల జిల్లా రైతుల దశా, దిశ మారనుందని పేర్కొన్నారు. రవాణా వ్యవస్థను, రైల్వే వ్యవస్థను మెరుగుపరిచినట్లయితే ఇందూర్ నుంచి పసుపునకు సంబంధించిన
ఎగుమతులు వివిధ రూపాల్లో దేశ, విదేశాలకు సైతం చేరవేసే సత్తా ఇందూర్ రైతులకు దక్కనుందని స్పష్టం చేసారు.