Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 5:02 pm Posted by : ramakrishna

కామారెడ్డి కలెక్టర్‌ను కలిసిన ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ జిల్లా కలెక్టర్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ భేటీలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, పట్టణంలో చేపడుతున్న పలు ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే పట్టణ అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా కలెక్టర్‌తో కమిషనర్ చర్చించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎదురవుతున్న కొన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు కోరినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్ పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు సమాచారం. ఈ సమావేశం సానుకూల వాతావరణంలో జరిగినట్లు అధికారులు తెలిపారు.