Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 April 2025, 4:50 pm Posted by : ramakrishna

చెత్తతో నిండిన ఎల్లయ్య చెరువు

  • పట్టించుకోని అధికారులు

 

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువు కట్ట పై భవన శిథిలాలు, చెత్త చెదరానికి నిలయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. శిథిలాలు, చెత్త చెదారాన్ని కట్టపై పారబోయడంతో దుర్వాసన తో రోగాల బారిన పడి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెరువును సుందరీకరణ పేరుతో కట్టను వెడల్పు చేసి వదిలేశారని, ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసే వాకర్సు,స్థానికులు దుర్వాసనను భరించలేకపోతున్నామని వాపోతున్నారు.కట్టను వెడల్పు చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టిప్పర్లు, ట్రాక్టర్ల తో భవన శిథిలాలను ,చెత్తను తీసుకొచ్చి కట్ట పై పారబోస్తున్నారనీ  అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు.అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఇదంతా జరుగుతుందని, శిథిలాలు,చెత్తను పారబోసే వారు మాత్రం అవన్నీ పెడచెవిన పెట్టి వాళ్ళ పని వారి చేసుకోబోతున్నారని అధికారుల నిర్లక్ష్యంతోనే ఇదంతా జరుగుతుందని స్థానికులు తెలుపుతున్నారు.ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టి చర్యలు తీసుకొవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చెరువు పరిసరాల లో శిథిలాలు, చెత్తా చెదారం వేయకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Yellaiah Lake full of garbage