శబరిమలలో అయ్యప్పను దర్శించుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, బతుకమ్మ: కేరళ రాష్ట్రంలోని శబరిమలలో బంగారు కోవెలలో కొలువై వున్నా కలయుగ దైవం ధర్మశాస్త శ్రీశ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామిని మంగళవారం తెల్లవారు జామున ఎల్లారెడ్డి శాసనసభ్యులు కే. మదన్ మోహన్ రావు తన తనయుడు కార్తీక్ రావు తో కలిసి, దాదాపు 7కిలోమీటర్ల చిన్నపాదం కొండ కాలినడకతో వెళ్లి దర్శించుకున్నారు. కేరళ ట్రావెన్ కోర్ సంస్థానం అధికారులు ప్రోటో కాల్ ప్రకారం దర్శనం కల్పించారు. సోమవారం రాత్రి శబరిమల కొండకు కాలి నడకన చేరుకున్న ఎమ్మెల్యే, రాత్రి స్వామిని ఒకసారి దర్శించుకొని, మళ్ళీ...